Saturday, August 28, 2010

కర్మ సిద్దాంతం

కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచనా
మాకర్మఫలహేతుర్భు ,మాతే సంగోస్త్య కర్మణి.

నీకు కర్మాధికారమే కాని ఫలితాధికారం లేదు.కర్మఫలానికి నీవు కారణమని భావించరాదు.కర్మను విడచిపెట్టే మనస్సు నీకు రాకూడదు అన్నారు గీతచార్యులవారు.కర్మ అంటే కర్తవ్యం.కర్తవ్యపరునికి జయాపజయాలు, హితాహితాల విశ్లేషణ ఉండకూడదు.కర్తవ్య నిర్వహణ ఒక్కటే అతని గురిగా ఉండాలి.
కర్మ సిద్దాంతం అంటే కర్తవ్య సిద్దాంతం
పునర్జన్మ కర్మ ఈ రెండు హైన్దవధర్మానికి మూలాధారాలు.
సామాన్యులకు కానీ ,గృహస్తులకుకాని ప్రతిఫలాపేక్ష విడచి కర్మ చేయటం కుదరదు.ఎలాగంటే ,పాలకోసం పశువులని,పండ్లకోసం చెట్లను పెంచుతాం.ప్రతిఫలం ఆశించకుండా కర్మ చేయటం మహాత్ములకేతప్ప మామూలు మనుషులకి అసాధ్యం.
కురుపితామహుడైన భీష్ముడు కర్మ సిద్దాంత పరాయణుడై కురుక్షేత్రానికి వచ్చాడు .తప్పని తెలిసి దుర్యోధనుని పక్షాన అవిక్రపరాక్రమంతో పదిరోజులు యుద్ధం చేసాడు.మహాపండితుడైన భీష్ముడు కౌరవ పక్షాన నిలబడటానికి కారణం కర్మసిద్దంతం.
కర్మ సిద్దాంతం అనుభవంలోకి రావాలంటే వయోపరినితి ఉండాలి.ఒడిదుడుకులని చూడాలి.కష్టము ,నష్టము రెంటిలో మ్రాగ్గాలి ,ఎత్తుపల్లాలు నడవాలి.
"ధారనాత్ ధర్మః ఇత్యాహుహు ధర్మో ధారయతి ప్రజాః"
సంస్కృతంలో "ధృ" ధాతువుకి ధరించుట/పోషించుట అను రెండు అర్ధములు కలవు.మనిషియొక్క సర్వతో ముకాభివ్రుద్దికి ,మరియు ఆత్మోన్నతికి ఏది సాధనమో అదియే ధర్మం.

"ధర్మో విశ్వస్య జగతః ప్రతిస్తా "తితరీయోపనిషత్తు
"ధర్మే సర్వం ప్రతిస్తితం " నారాయణ ఉపనిషత్తు
కాబట్టి మనం కుదిరినంతలో ధర్మాచరణ చేద్దాం.
నా ఈ ప్రయత్నం లో లోపాలు కానీ నా పోస్ట్లలో లోపాలు కాని ఉంటె మన్నించ వనవి.

Wednesday, August 25, 2010

మంత్ర ప్రభావం

మకారో మననం ప్రాహుహు త్రకార స్త్రాన ఉచ్యతే
మనన స్త్రాన సంయుక్త మంత్ర ఇత్యభి దీయతే.


మాకారము అనగా మననము చేయుటవలన ,త్రాణము అనగా రక్షణ కలిగించేతువంటిది మంత్రము .ఇటువంటి మంత్రములచే వ్యక్తమైన వేదములు సాక్షాత్ విశ్వ మానవాళికి శ్రేయోదాయకం,ఇవి కేవలం మన భారతీయుల సొంతం వాటిని కాపాడుకోవలసిన భాద్యత మన అందరిది. ఈ గొప్ప సంపద మన భావితరాలకు అందించటానికి మనవంతు ప్రయత్నం చేద్దాం.

Thursday, July 22, 2010

ఎందఱో మహానుభావులు (నచికేతుడు)

వాజస్రవుడి కుమారుడు వాజస్రవాసుడు ఇతనికి గౌతముడు అనిపేరు ఎందుకంటే ఇతను గౌతమ వంశంలో పుట్టాడు, ఈయనకి అరుణి మరియు ఒవ్ద్దలకి అని పేర్లు .ఈయన తండ్రి విశ్వజిత్ యాగం చేసాడు . యాగాంతంలో తనకుగల సంపదనంతా దానం చేయాలి .యజ్ఞంత దక్షిణగా గోవులను దానం చేస్తున్నాడు కొడుకైన గౌతముడు చిన్నవాడైనా మహా బుద్ధిశాలి, తండ్రి దానం ఇచ్చే గోవులలో ముసలివి, గడ్డి తినటానికి పండ్లు లేనివి ఉన్నాయి వాటిని చూడగానే ఈయనకి బాధ కలిగిందిఅయ్యో నా తండ్రి ఇంత యాగం చేసి కూడా తామస దానం చేత సుఖం లేని దేవలోకప్రప్తి కలుగుతుంది అని ఆవేదనకలిగి చివరి నిముషం లో నైన హితం చేయాలనీ బుద్ధి తో "తండ్రి యాగంలో నీ సర్వస్వాన్ని దానం చేయాలికదా మరి నన్ను ఎవరికిస్తావు "అన్నాడు .తండ్రి ఇది బాల్యచేస్టగా తలచి ఊరుకున్నాడు ,మరల ఈయన నన్ను ఎవరికీ ఇస్తావని ప్రశ్నించాడు మరల తండ్రి ఏమి అనలేదు .

తెగెంతవరకు లాగాదలచాడు మన మునికుమారుడు, మరల తండ్రిని ప్రస్నిచేటప్పటికి ఆయన కోపంతో నిన్ను యముడికిస్తానన్నాడు. వెంటనే ఈయన నేను తండ్రికి ప్రధమ పుత్రుడినే ,శిష్యులలో ఉత్తముడిని కాకపోయినా అధముడినిమాత్రం కాదు, మరి నన్ను యముడికి ఇచ్చి ఈయన ఎం సాధిద్దామని అని అలోచించి ఆయన ఏవుద్దేసం లో అన్నా నేను తండ్రి గారి మరియు వంశం యొక్క సత్య శీలతను నిలబెట్టాలని తండ్రిని సమీపించినాడు.

కానీ తండ్రి గారు మాత్రం కోపంలో అన్న మాటకు చాల భాదపడుతూ కుమారుని దగ్గరకు తీసుకుని దుక్ఖిస్తుండగా తండ్రీ '' పైరు విధంగా మొలకెత్తి దాన్యన్నిచి చివరకు జీర్న్నమౌతున్నదో అలాగే మానవుడు జనన మరణ చెక్రంలో నసిమ్చక తప్పదు. కాబట్టి నా దేహంపైన మొహాన్ని విడిచిపెట్టి నాకు యమపురికి పోవటానికి అనుజ్ఞా ఇమ్మని యమపురికి బయలుదేరివెళ్ళేటప్పటికి అక్కడ యముడు లేదు ,దానితో రోజులు నిద్రాహారాలు మాని తపస్సు లో లీనమైపోయాడు , రోజుల తరువాత యముడు వచ్చి చూసేటప్పటికి ఒక బ్రహ్మ తేజేస్సుతో కూడిన బాలుని గమనించి తనవారి ద్వార అతని గురించి తెలుసుకున్న వెంటనే ఆయనకు భయం కలిగింది, ఎందుకంటే ఎవరి ఇంట ఐతే అగ్ని స్వరూపుడైన అతిధి పస్తున్తాడో ఇంటి యజమాని ఇష్తాపూర్థాలు నశిస్తాయని స్మ్రుతివాక్యం గుర్తుకు వచ్చి వెంటనే నచికేతుని సమీపించి హె భ్రమ్మ స్వరూప, నీవు వయస్సులో చిన్నవాడివైనా అతిధిగా నీకు నమస్కారం అని నావల్ల నీకు అతిధిగా జరిగిన నిరాదరణకు నన్ను క్షమించి నాకు శుభం కలిగేల దీవించు దీనికి పరిహారంగా వారలు ఇస్తాను కోరుకో అన్నాడు.

వెంటనే నచికేతుడు మహాత్మా అలాగే నీ హితం కోసం వారలు కోరుకుంటాను అని మొదటగా స్వామి నేను తిరిగి నా తండ్రిని చేరితే ఆయన ఎఁటువంటి అనుమానాలు లేక (మృత్యువు వద్దకు వెళ్ళినవాడు తిరిగి రావటమేమిటి అని సంసయించక ) నన్ను గుర్తించాలి.
. విద్య వలన స్వర్గలోక వాసులు సుఖ దుఃఖములు లేక జీవిస్తారో విద్యని (అగ్నిచయనం) ఉపదేశించు అనగాఁ యముడు సంతోషం తో క్రతువుకి కావలసిన పదార్ధములతో సహా అగ్ని చయనమును ఉపదేసిమ్పగా, దానిని నచికేతుడు తిరిగి యమునకు అప్పగించాగానే ఏకసంతాగ్రహణమునకు మెచ్చి నాయనా నాచే నీకు నేర్పబడిన విద్య 'నచికేతాగ్ని' గా పిలువబడి ఎవర్రైతే దీనిని శ్రద్ధతో పర్యాయములు ఆచరిస్తాడో అతడు త్రిణాఁచికేతుడు అని పిలువబడి స్వర్గ లోకాన్ని పొందుతాడు అని పలికాడు.
ఇక 3 వరం, స్వామి ఇప్పటి వరకు కోరుకోన్నవి అనాత్మక విషయాలు, ఇక మూడవది ఆత్మవిషయం అదేమిటంటే లోకంలో మరణించిన తరువాత ఆత్మ ఉంటుందని కొందరు ఉండదని కొందరు ఆంటారు. ఇందులో ఏది సత్యం, అసలు జీవుడు మరణించిన తరువాత ఏమౌతున్నాడు అని భ్రహ్మన్ని గురించి వరం అడిగాడు .
"ఆత్మవిద్య యోగ్యు లకే ఉపదేసించాలి కాని అయోగ్యులకి ఉపదేసిస్తే అది ఫలించదు కదా చివరికి శుష్క వేదాంతమై సమాజానికి చెడుచేస్తుంది. అందుకు ఈతడుయోగ్యుదాకాడా అని పరీక్శించి ఉపదేసిన్చాలని , నాయనా అది మహాతప్పస్సంపన్నులకే అసాధ్యమ్ము, దానికి మారు మరేదైనా ధనధాన్యాదులు , స్వర్గలోక భొగాలు కానీ కోరుకో ఇస్తాను అని పలికాడు యముడు.
దానికి ప్రతిగా యమరాజా ఆసాస్వితమైనసౌఖ్యాలు నాకు వద్దు ,అందుచేత మరణానంతరమైన ఆత్మ విద్య నాకు కావాలని అత్మజ్గానాన్నే కోరినందున యితడు అర్హుడని నిర్ణయించి అతనికి ఇలా ఉపదేసించాడు.

"""" ఋగ్వైదాదులు దేన్ని పొందదగినదిగా భోదిస్తున్నాయో, దేన్ని పొందడానికి తపస్సులు చేయబడుతున్నాయో ,దేన్నీ కోరి నైష్టికa బ్రహ్మ్మచర్యం పాటింపబడుతూ ఉంటుందో , పరమార్ధం ఓం శబ్ద వాచ్యం . ఓం అనే తత్త్వం నాశనం లేని పరభ్రమ్మం . నాసరహిత ప్రణవాన్ని తెలుసుకొని ఉపాసించేవాడు దేన్నీ కోరుతాడో అది అతనికి లభిస్తుంది.నిద్రించివున్న సర్వ జీవులలోను కోరికను సృష్టిస్తూ పురుషుడు మేలుకొని ఉన్నాడో అదే నశరహితమ్మైన ,పరిసుద్దమైన బ్రహ్మ్మం .ఇదే నీవడిగిన ఆత్మ స్వరూపం . ఎవరితే శబ్ద స్పర్స రూప రస గంధాలులేని, నాశరహితము నిత్యమూ, ఆది అన్తాలులేని, బుద్దికి విలక్షణంఐన ఆత్మను తెలుసుకొని జీవిస్తున్నాడో అతడు ఉత్తముడు అని
తెలిపాడు .

నచికేత మార్గం పదునైన కత్తి అంచు మీది నడక కాబట్టి ఉత్తిస్టత (లే ),జాగ్రత (మేల్కొ),ప్రప్యావరాన్ నిభోదత (శ్రేష్టులైన గురువుల దరిచేరి నీ ఆత్మ తత్వమును తెలుసుకో ) అని దీవించి పంపాడు.

ఇది నా మనవి

బ్లాగరులందరికి నా విన్నపం నేను కొత్తగా బ్లాగ్లో చేరాను నాకు ఇది కొత్త కాబట్టి ఇందులో ఎవైన అక్షరదోషాలు ఉంటె నన్ను మన్నించ ప్రార్ధన
అలాగే నాకు మీ అమూల్యమైన సూచనలు ఇంచ్చి నన్ను దీవిస్తారని ఆసిస్తూ మీ వాజసనేయ