Saturday, August 28, 2010

కర్మ సిద్దాంతం

కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచనా
మాకర్మఫలహేతుర్భు ,మాతే సంగోస్త్య కర్మణి.

నీకు కర్మాధికారమే కాని ఫలితాధికారం లేదు.కర్మఫలానికి నీవు కారణమని భావించరాదు.కర్మను విడచిపెట్టే మనస్సు నీకు రాకూడదు అన్నారు గీతచార్యులవారు.కర్మ అంటే కర్తవ్యం.కర్తవ్యపరునికి జయాపజయాలు, హితాహితాల విశ్లేషణ ఉండకూడదు.కర్తవ్య నిర్వహణ ఒక్కటే అతని గురిగా ఉండాలి.
కర్మ సిద్దాంతం అంటే కర్తవ్య సిద్దాంతం
పునర్జన్మ కర్మ ఈ రెండు హైన్దవధర్మానికి మూలాధారాలు.
సామాన్యులకు కానీ ,గృహస్తులకుకాని ప్రతిఫలాపేక్ష విడచి కర్మ చేయటం కుదరదు.ఎలాగంటే ,పాలకోసం పశువులని,పండ్లకోసం చెట్లను పెంచుతాం.ప్రతిఫలం ఆశించకుండా కర్మ చేయటం మహాత్ములకేతప్ప మామూలు మనుషులకి అసాధ్యం.
కురుపితామహుడైన భీష్ముడు కర్మ సిద్దాంత పరాయణుడై కురుక్షేత్రానికి వచ్చాడు .తప్పని తెలిసి దుర్యోధనుని పక్షాన అవిక్రపరాక్రమంతో పదిరోజులు యుద్ధం చేసాడు.మహాపండితుడైన భీష్ముడు కౌరవ పక్షాన నిలబడటానికి కారణం కర్మసిద్దంతం.
కర్మ సిద్దాంతం అనుభవంలోకి రావాలంటే వయోపరినితి ఉండాలి.ఒడిదుడుకులని చూడాలి.కష్టము ,నష్టము రెంటిలో మ్రాగ్గాలి ,ఎత్తుపల్లాలు నడవాలి.
"ధారనాత్ ధర్మః ఇత్యాహుహు ధర్మో ధారయతి ప్రజాః"
సంస్కృతంలో "ధృ" ధాతువుకి ధరించుట/పోషించుట అను రెండు అర్ధములు కలవు.మనిషియొక్క సర్వతో ముకాభివ్రుద్దికి ,మరియు ఆత్మోన్నతికి ఏది సాధనమో అదియే ధర్మం.

"ధర్మో విశ్వస్య జగతః ప్రతిస్తా "తితరీయోపనిషత్తు
"ధర్మే సర్వం ప్రతిస్తితం " నారాయణ ఉపనిషత్తు
కాబట్టి మనం కుదిరినంతలో ధర్మాచరణ చేద్దాం.
నా ఈ ప్రయత్నం లో లోపాలు కానీ నా పోస్ట్లలో లోపాలు కాని ఉంటె మన్నించ వనవి.

10 comments:

  1. బాగుంది, కానీ ఇంకా వివరంగా వ్రాసి ఉంటే ఇంకా బాగుండేది. కర్మ సిద్ధాంతం అంటే కర్తవ్య సిద్ధాంతం అన్నారు కదా. అలాంటప్పుడు చాలామందికి సాధారణంగా ’కర్మ’ అంటే ఉండే అభిప్రాయాల గురించి కూడా చర్చిస్తే బాగుండేది. (కర్మ అంటే కర్తవ్యమే అయితే పాప/పుణ్య కర్మలు వాటి ఫలితాల గురించి జనసామాన్యంలో ఉండే భావనల మాటేమిటి?)

    >>గృహస్తులకి ప్రతిఫలాపేక్ష విడచి కర్మ చేయటం కుదరదు.
    ఇది కూడా కొంచం వివరంగా చర్చించాల్సిన విషయమే. మీరన్నదే నిజమైతే మరి గృహస్థులకి భగవద్గీతతో పనేమిటి?

    సరదాకి రాసిన కామెంటు, సీరియస్ గా తీసుకోకండి.

    బ్లాగులు సరదాగా రాసుకునేవే కాబట్టి లోపాల గురించి ఆలోచించకండి. మీకు తోచిన/నచ్చిన విధంగానే రాస్తూ ఉండండి.

    ReplyDelete
  2. నాగమురళి గారికి,
    ధన్యవాదములు, మీలాంటివారి సూచనలే మమ్మల్ని ఆలోచింపచేస్తాయి, మొదటి ప్రశ్నకి నా వివరణ , మనింటికి ఒక యాచకుడు ఆకలితో వస్తే మనకర్తవ్యం అన్నం పెట్టటం ఇదే మనం చేసే కర్మ,ఆ అన్నం తిని వాడు మనకి కృతజ్ఞతా చూపిస్తాడ లేకపొతే వాడు ఆకలి తీరినతరువాత దొంగతనం చేస్తాడా ,అలాచేస్తే మనం పాపం చేసినవారిమౌతామేమో ఇవి ఆకర్మగురించి మనం ఆలోచించే పాపపుణ్యాలు, గీతచార్యులవారు చెప్పింది వాడి ఆకలి తీర్చమని తద్వారా కలిగే ఫలితానికి మనం కారణం కాదు.ఇదే కర్మలో ఉన్న కర్తవ్యమ్.
    అయ్యా నా వివరణ అర్ధవంతంగా లేకపోతె మీరు తెలేయచేయ మనవి.
    రెండవ ప్రశ్నకి సమాధానం కొంత వివరంగా వ్రాస్తాను త్వరలో.

    ReplyDelete
  3. బాగుంది మీ వివరణ. మన చేతిలో ఉన్న కర్తవ్యం మీద దృష్టి పెట్టి మన చేతిలో లేని ఫలితాలపైన దృష్టిని వదిలేస్తే మనకి నిజమైన సుఖం అనుభవం అవుతుంది.
    ఇంకా విరివిగా రాస్తూ ఉండండి.

    ReplyDelete
  4. మీరు టైపోల గురించి ఇంకొంచం జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. బ్లాగు టైటిల్ కూడా ‘శృణ్వన్తు విశ్వే అమృతస్య పుత్రాః’ అని ఉండాలనుకుంటాను.

    సరిచెయ్యాల్సినవాటికి మరి కొన్ని ఉదాహరణలు -
    ప్రతిస్తా - ప్రతిష్ఠా
    ప్రతిస్తితం - ప్రతిష్ఠితం
    ధారనాత్ - ధారణాత్
    వగైరా... :-)

    ReplyDelete
  5. తప్పకుండా,కాని నాకు కొన్నిసార్లు నా కి ణ కి టైపింగ్ కుదరటం లేదు. ప్రయత్నం చేస్తాను.

    ReplyDelete
  6. మీ వివరణని, ఈశావాశ్యోపనిషత్ లోని "కుర్వన్నేవేహ కర్మాణి" శ్లోకం తో అన్వయించి రాసి చూడండి. అప్పుడు మరింత స్పష్టత వస్తుంది.

    ReplyDelete
  7. విధిరాత అంటే విధాత(దేవుడు) రాసిన రాత. దీనినే తలరాత అని కూడా అంటారు.
    ఇస్లాంలో కర్మ సిద్దాంతం
    # "అన్నీ ముందుగానే అల్లాహ్ నిర్ణయిస్తాడు, ఆయన నిర్ణయం ప్రకారమే అన్నీ జరుగుతాయి" (ఖురాన్ : 14:4, 16:93 , 2:7 , 6:148 , 7:186. )
    # అలాహ్ మనిషి అత్మను చేసి అందులోకి పాప పుణ్యాలు రెంటినీ ఊదుతాడు.(ఖురాన్ 91:8).
    # శిశువు గర్భంలోఉన్నప్పుడే మగా ఆడా , మంచివాడౌతాడా చెడ్డవాడౌతాడా ,అతని పనులు,ఉపాధి,ఆయుషు వ్రాసినతరువాతే అల్లాహ్ ప్రాణం పోస్తాడు.కొంతమంది స్వర్గార్హత కొద్దిలో కోల్పో వచ్చు,నరకాన్ని కొద్దిలో తప్పించుకోనూ వచ్చు(బుఖారీ 59:6,ముస్లిం:1216)
    # విధివ్రాత ప్రకారమే ఏ పనైనాజరుగుతుంది (ముస్లిం :1218)
    # ప్రతి ఒక్కరి స్థానం స్వర్గం లేదా నరకంలో ముందుగానే వ్రాయబడిఉంది.అదృష్టవంతుడికి మంచిపనులు చేసే సద్బుద్ది కలుగుతుంది.దురదృష్టవంతుడికి చెడ్డపనులుచేసే దుర్బుద్ది పుడుతుంది.(బుఖారీ 23:83)

    క్రైస్తవంలో కర్మ సిద్దాంతం
    * యెహోవా -తల్లి నిన్ను కనక ముందే ఆమెగర్భంలో ఉండగానే నీవేమౌతావో నాకు తెలుసు ,తమ్ముడు అన్న కంటే గొప్పవాడౌతాడు లాంటి ప్రవచనాలు పంపుతాడు .
    * తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారిని ముందుగా నిర్ణయించెను.ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను.ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను.ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను (రోమా 8:28-30)
    * మనలను ముందుగా తనకోసరము నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడకమునుపే ఆయన మనలను ఏర్పరచుకొనెను.దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు (ఎఫెసీ 1:5,11)

    ReplyDelete
  8. విత్ రియల్ గారికి,
    తప్పకుండా మీరు ఇచ్చిన సలహా పాటిస్తాను,అలాగే నా పోస్ట్లపై మీ అభిప్రాయాలు చెపుతూ ఉండండి.
    రహమతుల్లా గారికి,
    నేను మీ బ్లాగ్ చదువుతూ ఉంటాను మీకులా ఒక్కరు ఈ సమాజం లో ఆలోచించినా ఈ ద్వేష భావాలు ఉండవు,
    మీరు కామెంట్ రాసినందుకు ధన్యవాదములు.

    ReplyDelete
  9. రహమతుల్లా గారు మీరు కూడా మీ అభిప్రాయలు తెలుపుతూ ఉండండి

    ReplyDelete
  10. బాగున్నాయండి ..మీ రచనలు .

    ReplyDelete