Saturday, August 28, 2010

కర్మ సిద్దాంతం

కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచనా
మాకర్మఫలహేతుర్భు ,మాతే సంగోస్త్య కర్మణి.

నీకు కర్మాధికారమే కాని ఫలితాధికారం లేదు.కర్మఫలానికి నీవు కారణమని భావించరాదు.కర్మను విడచిపెట్టే మనస్సు నీకు రాకూడదు అన్నారు గీతచార్యులవారు.కర్మ అంటే కర్తవ్యం.కర్తవ్యపరునికి జయాపజయాలు, హితాహితాల విశ్లేషణ ఉండకూడదు.కర్తవ్య నిర్వహణ ఒక్కటే అతని గురిగా ఉండాలి.
కర్మ సిద్దాంతం అంటే కర్తవ్య సిద్దాంతం
పునర్జన్మ కర్మ ఈ రెండు హైన్దవధర్మానికి మూలాధారాలు.
సామాన్యులకు కానీ ,గృహస్తులకుకాని ప్రతిఫలాపేక్ష విడచి కర్మ చేయటం కుదరదు.ఎలాగంటే ,పాలకోసం పశువులని,పండ్లకోసం చెట్లను పెంచుతాం.ప్రతిఫలం ఆశించకుండా కర్మ చేయటం మహాత్ములకేతప్ప మామూలు మనుషులకి అసాధ్యం.
కురుపితామహుడైన భీష్ముడు కర్మ సిద్దాంత పరాయణుడై కురుక్షేత్రానికి వచ్చాడు .తప్పని తెలిసి దుర్యోధనుని పక్షాన అవిక్రపరాక్రమంతో పదిరోజులు యుద్ధం చేసాడు.మహాపండితుడైన భీష్ముడు కౌరవ పక్షాన నిలబడటానికి కారణం కర్మసిద్దంతం.
కర్మ సిద్దాంతం అనుభవంలోకి రావాలంటే వయోపరినితి ఉండాలి.ఒడిదుడుకులని చూడాలి.కష్టము ,నష్టము రెంటిలో మ్రాగ్గాలి ,ఎత్తుపల్లాలు నడవాలి.
"ధారనాత్ ధర్మః ఇత్యాహుహు ధర్మో ధారయతి ప్రజాః"
సంస్కృతంలో "ధృ" ధాతువుకి ధరించుట/పోషించుట అను రెండు అర్ధములు కలవు.మనిషియొక్క సర్వతో ముకాభివ్రుద్దికి ,మరియు ఆత్మోన్నతికి ఏది సాధనమో అదియే ధర్మం.

"ధర్మో విశ్వస్య జగతః ప్రతిస్తా "తితరీయోపనిషత్తు
"ధర్మే సర్వం ప్రతిస్తితం " నారాయణ ఉపనిషత్తు
కాబట్టి మనం కుదిరినంతలో ధర్మాచరణ చేద్దాం.
నా ఈ ప్రయత్నం లో లోపాలు కానీ నా పోస్ట్లలో లోపాలు కాని ఉంటె మన్నించ వనవి.

Wednesday, August 25, 2010

మంత్ర ప్రభావం

మకారో మననం ప్రాహుహు త్రకార స్త్రాన ఉచ్యతే
మనన స్త్రాన సంయుక్త మంత్ర ఇత్యభి దీయతే.


మాకారము అనగా మననము చేయుటవలన ,త్రాణము అనగా రక్షణ కలిగించేతువంటిది మంత్రము .ఇటువంటి మంత్రములచే వ్యక్తమైన వేదములు సాక్షాత్ విశ్వ మానవాళికి శ్రేయోదాయకం,ఇవి కేవలం మన భారతీయుల సొంతం వాటిని కాపాడుకోవలసిన భాద్యత మన అందరిది. ఈ గొప్ప సంపద మన భావితరాలకు అందించటానికి మనవంతు ప్రయత్నం చేద్దాం.